Mana Telugu Radio

Friday, November 22, 2013

నేను కూడా ఇప్పటి నాలా ఆలోచిన్చేదాన్ని కాదు ఒకప్పుడు......

నేను కూడా ఇప్పటి నాలా ఆలోచిన్చేదాన్ని కాదు ఒకప్పుడు......మనిషి తన ఆలోచనలకు రోజురోజుకీ మెరుగులు దిద్దుకుంటూ.....తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవిత అర్ధం.....నేను కూడా నా ఆలోచనలకు మెరుగులు దిద్దుకుంటున్న ప్రయత్నమే.....భావాలను స్నేహితులతో  పంచుకోవడం.....

కథలు,కబుర్లు.....మాటలు,పాటలు.......

కథలు,కబుర్లు.....మాటలు,పాటలు.......కష్టాలు,సుఖాలు.......కోపాలు,తాపాలు.....పంచుకోవడానికి ఒక పేరు కోరుకుంటుంది మనసు......ఆ పేరుకే ఒక అస్పష్టమైన రూపం ఉంటే....అపురూపమవుతుంది.......ఆ అపురూపం తనకెదురైతే.....అద్వైతమవుతుంది !!!!

Thursday, November 21, 2013

కొన్ని వందల సంవత్సరాల క్రితం బానిసత్వంలో ఉన్న కొందరికి

  1. కొన్ని వందల సంవత్సరాల క్రితం బానిసత్వంలో ఉన్న కొందరికి(మనం పూర్వీకులు కూడా బ్రిటిష్ వాళ్ళ కింద బానిసత్వాన్నే అనుభవించాం ) ...వాళ్ళ శరీరాన్ని ,మనసుని బానిసత్వానికి పణంగా పెట్టాల్సి వచ్చింది....కానీ కొందరు శరీరాన్ని మాత్రం బానిసత్వానికి అర్పించి ....మనసుని అర్పించకుండా రక్షించుకున్నారు.....అలాంటి గొప్ప వ్యక్తులు వారి అనుభవాలతో కొన్ని పుస్తకాలు కూడా రచించారు.....
    వారి స్ఫూర్తి మనకు ఆదర్శప్రాయం...!!

మన ఆత్మీయులు కానీ,బంధువులు కానీ,(బద్ధ శత్రువులైనా కూడా..)...

Mana Telugu Radio
  1. మన ఆత్మీయులు కానీ,బంధువులు కానీ,(బద్ధ శత్రువులైనా కూడా..)...కష్టాల్లో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు,లేదా....ఈ లోకాన్నే వదిలి వెళ్ళిన సమయాల్లో...వాళ్ళు కానీ ,వాళ్ళ బంధువులు కానీ మనల్ని ఆహ్వానిస్తేనే మనం వెళ్లి వాళ్లకు(వాళ్ళ బంధువులకు) ఓదార్పు అందించాలనుకోవడం పొరపాటు.....
    ఎందుకంటే కొంతమందిని నేను గమనించాను..."వాళ్ళు చెప్పలేదు కదా..." "వాళ్ళు మమ్మల్ని రమ్మని ఆహ్వానించలేదు కదా "అని, ఇంతకు ముందు ఉన్న పంతాలు కొన్ని మనసులో ఉన్న కారణం వలన కూడా పరామర్శించడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు.....
    కానీ మనం ఆలస్యం చేసిన ఒక్కొక్క క్షణం జీవితంలో మళ్లీ తిరిగి సరిదిద్దుకోలేని తప్పు చేసే ఒక్కొక్క క్షణం అని గుర్తించాలి.....
    అలాంటి సమయాల్లో పంతాలు,పట్టింపులు లేకుండా.....మనం మన ఆత్మీయులకు అన్ని అయి ఓదార్పు అందించాలి.....ఇలాంటి సమయాల్లో మనం చూపించే కాస్త ఓదార్పు వాళ్లకు కొండంత బలాన్ని ఇస్తుంది....
    అప్పుడే మనలోని మానవత్వానికి మెరుగులు దిద్దుకోగలం.....!!!!!!!

Sunday, November 17, 2013

మనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం(జీవితంలాంటిదే అనుకోండి).

Mana Telugu Radioమనం ఒక రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం(జీవితంలాంటిదే అనుకోండి).....మన కంటే ముందు అదే రోడ్డు మీద ప్రయాణించిన మన ఆత్మీయులు ఆరోడ్డు గురించి మనకు సూచనలు ఇచ్చి ఎలా ప్రయాణం చేయాలో చెబుతారు......సూచనలు మనసులో గుర్తు చేసుకుంటూ......ప్రయాణం సాగిస్తూ ఉంటాం.....రోడ్డు కొన్నిచోట్ల మనం ఊహించిన విధంగానే.....ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.....కొన్ని చోట్ల ఊహించని గతుకుల్లో కాలు జారి పడిపోతాం.....ప్రాణం పోయేంత ప్రమాదం జరగకపోయినా కొన్ని రోజులు కోలుకోలేనంత గాయాలు తగులుతాయి.....తర్వాత కోలుకుంటాం....
మళ్లీ ప్రయాణం మొదలు పెడతాం.....ఈ సారి, ఇంతకు ముందు పడిపోయి గాయాలు తగిలించుకున్న "రహదారి మాయాజాలం"మళ్లీ కనిపిస్తుంది......ఈ సారి అప్రమత్తమవుతాం.....అలాంటి గతుకులను చాకచక్యంగా తప్పించుకుని ముందుకు వెళ్ళిపోతాం....
తప్పించుకోలేక పోతే,ఇంతకు ముందు ఎలా పడిపోయామో తెలుసుకోలేకపోతే.....ఆ అనుభవాల నుండి మనం ఏమీ నేర్చుకోలేకపోతే.....మన ప్రయాణం ఆగిపోక తప్పదు....!!!

Friday, November 15, 2013

Naa Chinnathanamlo Nannu

నా చిన్నతనంలో నన్ను పిల్లలకోడి అని పిలిచేవాళ్ళు....వయసుతో నిమిత్తం లేకుండా చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ నాకు స్నేహితులే......ఇంతకుముందు మా సీనియర్స్ కనిపెట్టిన ఆటలే కాకుండా....మేము ఏవేవో కొత్త ఆటలు సృష్టించాలని చూసేవాళ్ళం....అలా ఒకసారి నా స్...
నేహితులంతా కలిసి ఒక ఆట కనిపెట్టారు..దానిపేరే "మట్టిలో పట్టీ"..నా కాళ్ళకి ఉన్న పట్టీలు ఒకటి తీసి ఇస్తే ,అవి మట్టిలో దాచేస్తే ...మేము తర్వాత ఎక్కడ దాచారో కనిపెట్టడం.....,

అప్పుడే కొత్తగా కొన్న పట్టీలు ....పడిపోతాయని మా అమ్మ అన్నా వినకుండా....మా నాన్నతో సిఫార్సు చేపించి మరీ పెట్టుకున్నాను.....అయినా ఫ్రెండ్స్ అడిగినప్పుడు మనం కాదు అనం కదా.....చాలా సార్లు ఆట ఆడాం.....మట్టిలో దాచిన పట్టీ దొరికినప్పుడల్లా మురిసిపోయాం.....చివరికి ఇక ఇంటికి వెళ్లిపోతాం అనగా జరిగింది.....ఒక అద్భుతమైన సంఘటన....మట్టిలో దాచిన పట్టీని కనిపెట్టలేకపోయాం......
ఇంటికెళ్ళాక అంతకంటే అద్భుతంగా నా వీపు విమానం మోత మోగిందనుకోండి.......
తర్వాత పెద్దవాళ్లందరూ.....చిన్నపిల్లల్లా "మట్టిలో పట్టీ"ఆట ఆడుకుంటుంటే..... నవ్వకుండా ఉండలేక ..ఏడుస్తున్నట్టు నటించలేక, మేము అనుభవించిన బాధ వర్ణించలేనిది......!!!