Mana Telugu Radio

Tuesday, December 24, 2013

నా చిన్నతనంలో క్రిస్మస్ అంటే

నా చిన్నతనంలో క్రిస్మస్ అంటే "మాలోళ్ళ పండగ" అనుకునేవాళ్ళం....అప్పటి సమాజం ప్రభావం అది....
ఇప్పుడు క్రిస్మస్ అంటే "మాలోగిళ్ళ పండగ" అనుకుంటున్నాం .....ఇప్పటి సమాజం ప్రభావితం ఇది ....!!!!
.................క్రిస్మస్ శుభాకాంక్షలతో.................

Sunday, December 22, 2013

విలువ లేని భావాలు లేవు ఈ ప్రపంచంలో

విలువ లేని భావాలు లేవు ఈ ప్రపంచంలో ....విలువ కట్టలేకపోయిన భావాలు మాత్రం ఉన్నాయి .....!!!!

ఇండియా లో కొంతకాలం క్రితం ....ఓ రోజు ........( ఇది నిజంగా జరిగిన సంఘటన .....)

ఇండియా లో కొంతకాలం క్రితం ....ఓ రోజు ........( ఇది నిజంగా జరిగిన సంఘటన .....)
"హలో ....శ్రీలక్ష్మి గారేనా ???"
"అవునండీ ...చెప్పండి "
నేను ....1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నానండీ....ఇందాక మీరు కార్ ఆక్సిడెంట్ గురించి కంప్లైంట్ ఇచ్చి వెళ్లారు కదా ...."
"అవునండీ ...నేనే ఇచ్చింది ...చెప్పండి ..."
"కంప్లైంట్ లో మీ కాస్ట్ గురించి చెప్పలేదు .....మీ కాస్ట్ ఏమిటో చెప్పండి ....."
"తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉందా ....???"
"లేదండీ ... మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి ....లేకపోయినా పర్వాలేదు ..."
"అయితే నాకు అభ్యంతరం ఉంది ....చెప్పను ...."
"............................"

వందమంది చెప్పిన తర్వాత

వందమంది చెప్పిన తర్వాత, ఒకవ్యక్తి వ్యక్తిత్వం మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం ....నిజమైన అభిప్రాయం కాదు .....
ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత, లక్షమంది చెప్పినా కూడా ఆ అభిప్రాయం మార్చుకోకపోవడం....నిజమైన అభిప్రాయం .....!!!

Mana Telugu Radioనా శ్రేయోభిలాషులు నాకు ఇచ్చిన పొగడ్త(లేదా విమర్శ)....

Mana Telugu Radioనా శ్రేయోభిలాషులు నాకు ఇచ్చిన పొగడ్త(లేదా విమర్శ)....."నువ్వు సంతోషంగా ఉన్నంత సేపు నీ చుట్టూ ఉన్నవాళ్ళని అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంచుతావు......నీ సంతోషాన్ని అందరికీ పంచుతావు.....నువ్వు బాధగా ఉంటే మాత్రం ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతావు ....నీ బాధను మాత్రం ఎవరికీ పంచవు .....అది మంచిది కాదు ....నీ బాధను కూడా ఆత్మీయులకు పంచినప్పుడే అది తగ్గుతుంది....." అని .......,
నా సమాధానం ఏదైనా కానివ్వండి .....,కానీ నేను నమ్మిన నమ్మకాలను నేను అనుసరిస్తున్నాను అనే సంతృప్తితో కూడిన నమ్మకం నా మీద నాకు నమ్మకాన్ని కలిగించిన క్షణం అది......!!!!!

Saturday, December 14, 2013

స్నేహితుల లేదా బంధువుల ఇళ్ళలో శుభకార్యాలకు తరచు మనం వెళుతూ ఉంటాం

 1. స్నేహితుల లేదా బంధువుల ఇళ్ళలో శుభకార్యాలకు తరచు మనం వెళుతూ ఉంటాం ....ఇక్కడ(అమెరికాలో)బంధువులు తక్కువ కాబట్టి స్నేహితుల శుభకార్యాలకు ఎక్కువ వెళుతూ ఉంటాం....అక్కడ ఇంతకుముందు పరిచయం ఉన్న స్నేహితుల్ని మళ్ళీ పలకరించే అవకాశం,కొత్త స్నేహితులు పరిచయమయ్యే అవకాశం ఉంటాయి ....అంతా స్నేహ వాతావరణం నిండి ఉంటుంది ......(బంధు వాతావరణం కాదు)
  ఏదైనా శుభకార్యాలకు వెళుతున్నామంటే ప్రత్యేకంగా అలంకరిచుకోవడం కూడా కాస్త సర...దాగానే ఉంటుంది .....ఇటీవల కొన్న నగలు,చీరలు చూపించాలనుకునే అలంకరణ కార్యక్రమం ప్రత్యేకం అనుకోండి .....
  నా విషయానికొస్తే .....అమెరికాలో చీర కట్టుకునే అవకాశం వస్తే వదులుకోవడమా అన్నట్లు ఒక గంట ముందుగానే కట్టుకుని కుర్చుంటాను ....ఒక చేతికి గడియారం పెట్టుకుంటే గాజులు గగ్గోలు పెట్టకుండా జాగ్రత్త పడతాను .....మేకప్ వేసుకునే అలవాటు లేదు కాబట్టి కాస్త పౌడెర్ రాసుకుని .....వాతావరణం ఎలా ఉందొ చూసుకుని(చెమట పట్టి చెరిగిపోకుండా) తిలకం(వాసన చాల ఇష్టం)పెట్టుకుంటాను ....ఇక మెడలో ఒక సన్నటి గొలుసు ,చెవులకు బుట్టలు ,కాళ్ళకు పట్టీలు పెట్టుకుని .....లిప్ కేర్ ఒకటి చేతిలో పట్టుకుంటాను .....అంతే .....అందరికంటే ముందు రెడీ అయిపోతాను ......అన్నట్లు శుభాకాంక్షలు తెలియజేయడానికి మనసులో నుండి తెచ్చుకున్న చిరునవ్వును సుగంధ పరిమళంగా చల్లుకుని వెళ్ళడం మర్చిపోను .....
  పార్టీకి వెళ్ళాక అందరితో ఎంత దగ్గరితనంతో మాట్లాడినా కూడా .... అలంకరణల గురించిన చర్చలకు అందనంత దూరం లో ఉంటాను .....ఎదుటివాళ్ళు అలాంటి చర్చల పట్ల ఆసక్తి చూపిస్తే చిరునవ్వుతో సరిపెట్టేస్తాను ....బాహ్య సౌందర్యం గమనించడం కంటే అంతః సౌందర్యం గమనించడం(మాట్లాడుకోవడం) ఇష్టం నాకు .....
  ఆ మధ్య ఒకసారి ఇలాగే పార్టీ కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప నా ఎదురుగా నిలబడి నన్ను అదే పనిగా గమనిస్తూ ఉంది ....నేను కూడా పలకరించాను .....
  "నీ ఫ్రెండ్స్ అందరు ఆడుకుంటుంటే నువ్వు ఇక్కడ ఉన్నావెందుకు .....నువ్వు కూడా ఆడుకో వెళ్లి "అన్నాను
  "ఆంటీ .....మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి ....ఎక్కడ కొన్నారు ...?" అని అడిగింది
  "ఆ విషయం నేను మీ అమ్మతో చెప్తానులే ...నువ్వు వెళ్లి ఆడుకో ....."అన్నాను ..... చిరునవ్వుతో,
  కానీ ఆశ్చర్యం లో నుండి చాలాసేపు తేరుకొలేకపోయాను ......పాప వయసు 10 సంవత్సరాలు .....
  పెద్దవాళ్ళు ఎదుటి వ్యక్తుల్లో ఏది చూసి మాట్లాడుకుంటారో పిల్లలు కూడా ఆ విషయాల మీదే వాళ్ళ దృష్టిని కేంద్రీకరిస్తారు ....కొంతమంది పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కూడా ఆ అలవాటును మర్చిపోలేరు .....మనం వ్యక్తుల అలంకరణ గురించి కాకుండా వాళ్ళలో ఉన్న మంచి గుణాల గురించి మాట్లాడుకుంటే పిల్లలు కూడా అవే చూడడం అలవాటు చేసుకుంటారు .....వ్యక్తుల్లోని మంచి ప్రవర్తనను అనుసరించడం మొదలై మంచి పౌరులుగా ఎదుగుతారు .... స్థాయీ బేధాలు లేని సమ సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది ..... మానసికంగా కూడా ఆరోగ్యవంతంగా జీవితం గడపొచ్చు .....!

Friday, November 22, 2013

నేను కూడా ఇప్పటి నాలా ఆలోచిన్చేదాన్ని కాదు ఒకప్పుడు......

నేను కూడా ఇప్పటి నాలా ఆలోచిన్చేదాన్ని కాదు ఒకప్పుడు......మనిషి తన ఆలోచనలకు రోజురోజుకీ మెరుగులు దిద్దుకుంటూ.....తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవిత అర్ధం.....నేను కూడా నా ఆలోచనలకు మెరుగులు దిద్దుకుంటున్న ప్రయత్నమే.....భావాలను స్నేహితులతో  పంచుకోవడం.....